Friday, May 3, 2024
- Advertisement -

“జాను” మూవీ రివ్యూ

- Advertisement -

శర్వానంద్ హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా హీరోయిన్ గా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన లవ్ ఎమోషనల్ మూవీ ’జాను’. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన “96” చిత్రానికి జాను చిత్రం రీమేక్. ఈ రోజే రిలీజ్ అయిన ఈ జాను ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : రామ్ (శర్వానంద్) ఓ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్. రామ్ కొన్ని కారణాల చేత అతను చదువుకున్న స్కూల్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని చిన్నప్పటి గుర్తులు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే అతని చిన్ననాటి స్నేహితులు అంతా కలిసి ఒక గెట్ టు గేదర్ ను ఏర్పాటు చెయ్యగా అక్కడికి జాను(సమంత)కూడా వస్తుంది. ఒకే క్లాస్ లో చదువుకున్న రామ్, జానుల మధ్య జరిగిన కథ ఏంటి ? వారి ప్రేమ ఎలా మొదలైంది ? ఎందుకు విడిపోయారు ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కావడం.. దాన్ని మన తెలుగు తగ్గట్లు రీమేక్ చేశారా అంటే కచ్చితంగా మన నేటివిటీకి తగ్గుట్టుగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. తమిళ్ 96 మూవీ చూడని వారికి ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ప్రధానంగా శర్వా మరియు సమంతల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే కథ మొత్తం వీరి చూట్టే తిరిగుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ కానీ చాలా చక్కగా వచ్చాయి. ఇక దర్శకుడు తమిళంలో ఎంత ఫీల్ తో తీశాడో.. తెలుగులో కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. ముఖ్యంగా ఎమోషన్స్, కెమిస్ట్రీ, నటన ఇలా అన్ని కోణాల్లోనూ సినిమాకు తగ్గట్టుగా చేయించాడు. మహేందిరన్ జయరాజు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అలాగే గోవింద్ వసంత అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. మిగిత నటినటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అలానే దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : ఈ సినిమాలో కమర్షలు హంగులు ఉండవు. అలానే కాస్త అక్కడ అక్కడ నెమ్మదిగా సినిమా సాగుతుంది.

మొత్తంగా : జాను.. ఎమోషన్ లా ఆకట్టుకునే సినిమా. శర్వానంద్ మరియు సమంతల నటన ప్రధాన బలం. కాస్త నెమ్మదిగా సాగే కథనం మైనస్ అయినప్పటికి హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కెమిస్ట్రీ మరియు ఎమోషన్స్ తో ప్రేక్షకుల్లో అద్భుతమైన ఫీల్ కలుగుతుంది. లవర్స్ మాత్రనే కాదు ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -