Thursday, May 16, 2024
- Advertisement -

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్స్..!

- Advertisement -

వైజాగ్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. గత రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్ లోని 201 ప్లాట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఓ మహిళతో పాటు మరో నగులురు విటుల్ని అరెస్ట్ చేశారు. ఐదుగుర్ని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజులుగా మాధవధారలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు దొరికిపోయిన వారిలో దొరబాబు, పరదేశితో పాటూ మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ హైపర్ ఆది టీమ్‌లో కమెడియన్స్‌గా చేస్తున్నారు. వీరితో పాటూ దొరికిన మరో ఇద్దరు ఎవరనేది తెలియాల్సి ఉంది.

ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటీవలే వైజాగ్ లో వ్యభిచార దందాలు బాగా పెరిగిపోయాయి. పోలీసులు నిఘా పెట్టి గుట్టు రట్టు చేస్తున్న సరే అపార్ట్‌మెంట్లను అడ్డాగా చేసుకుని కొందరు రెచ్చిపోతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. కానీ ఈసారి జబర్దస్త్ నటులు దొరికిపోవడం పెద్ద సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -