Friday, April 26, 2024
- Advertisement -

పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ మహేష్..!

- Advertisement -

ఒక ప్రముఖ ఛానల్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రసారమౌతున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జబర్దస్త్ మహేష్.

కిరాక్ ఆర్పి టీంలో వన్ ఆఫ్ ద మెయిన్ కంటెస్టెంట్ గా తన వెటకారం మాటలతో కామెడీ చేసి ఫేమస్ అయ్యాడు మహేష్. జబర్దస్త్ చేస్తున్నప్పుడే మహేష్ కి సినిమాలలో అవకాశాలు రావడం మొదలయ్యాయి. శతమానం భవతి సినిమా లో మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక రంగస్థలంతో మంచి నటుడిగా ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. ఈస్ట్ గోదావరి లోని ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చి నటుడిగా ఇప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న మహేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.

రీసెంట్ గానే మహేష్ కి పెళ్ళి కుదిరింది. లాక్ డౌన్ పూర్తయ్యాక మహేష్ పెళ్లి జరగబోతుందన్నట్లుగా తెలుస్తోంది. మహేష్ తన కాబోయే భార్యతో ఉన్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోస్ చూసినవారంతా మహేష్ కు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -