Friday, May 24, 2024
- Advertisement -

జబర్దస్త్ గడ్డం నవీన్ ఫ్యామిలీని చూశారా ?

- Advertisement -

ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన సూపర్ హిట్ షో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మన అందరికీ సుపరిచితుడు నవీన్. నవీన్ అనేకంటే గడ్డం నవీన్ అంటే చాలా త్వరగా గుర్తుపడతారు బుల్లితెర ప్రేక్షకులు. స్కిట్ మధ్య లో డైలాగ్స్ మర్చిపోయినప్పటికి తనదైన టైమింగ్తో నవ్విస్తాడు నవీన్.

ఇప్పుడు గడ్డం ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే గడ్డం నవీన్ ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాల్లో నటించాడు. అందులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ జబర్దస్త్ కి వచ్చాకే బాగా ఫేమస్ అయ్యాడు నవీన్. నవీన్ జబర్దస్త్ లో వేసే రాఘవేంద్రరావు గెటప్ అంటే చాలా మందికి ఇష్టం అని చెప్పాలి. అతని మొదటి సినిమా ప్రేమించేది ఎందుకమ్మ. ఆ చిత్రంలో పరిచయమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నవీన్. నవీన్ భార్య కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయేట.

ఆమె హీరోయిన్స్ కు డూప్ గా చేసేదట. నవీన్ కి ఇద్దరు కొడుకులు. ఒక అబ్బాయి పేరు అక్షయ్ కుమార్ మరో అబ్బాయి పేరు పవన్ దినేష్. ఆరు వందల యాభై రూపాయల జీతానికి ఆఫీస్ బాయ్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు ఎంతో ఎత్తుకు వెళ్ళాడు నవీన్. అతను మొదట ఆఫీస్ బాయ్ గా జాయిన్ అయిన కంపెనీలోనే నమ్మకంగా పని చేయడం వల్ల ఆఫీస్ బాయ్ నుండి మంచి పొజిషన్ కి వెళ్ళాడట నవీన్. తన కామెడీతో మనం అందర్ని నవ్విస్తూ నవీన్ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -