Friday, April 26, 2024
- Advertisement -

వైఎస్ రాజారెడ్డిగా జ‌గ‌ప‌తి బాబు అదుర్స్‌..!

- Advertisement -

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి డావైస్ రాజాశేఖ‌రరెడ్డి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ఆర్ చేసిన పాద‌యాత్రను బేస్ చేసుకుని ఈ సినిమాను చిత్రిక‌రిస్తున్నారు. మలయాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ పాత్రలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ , ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో న‌టుడు లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. న‌టుడు జ‌గ‌ప‌తి బాబు ఈ సినిమాలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్ర‌ను పోషిస్తున్నారు. సినిమాలో రాజారెడ్డికి సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

రాజారెడ్డిగా జగపతి బాబు గెటప్ బయటకొచ్చింది. ఖద్దర్ చొక్కా, కోరమీసంతో ఉన్న జగపతి బాబు లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పులివెందుల అంటే రాజారెడ్డి పేరు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌స్తావించాలి. ఆయ‌న‌ను అక్క‌డ పెద్ద ఫ్యాక్షనిస్టుగా పిలుస్తుంటారు. అదే స‌మ‌యంలో అక్క‌డ రాజారెడ్డిని దేవుడిగా కొలిచేవారు ఉన్నారు. మ‌రి అలాంటి క్యారెక్ట‌ర్ చేస్తున్న జ‌గ‌ప‌తి బాబు, రాజారెడ్డి పాత్ర‌లో ఎలా మెప్పిస్తారో చూడాలి. మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -