Tuesday, May 7, 2024
- Advertisement -

సునీల్ నన్ను వాడుకుని మోసం చేశాడు : హీరో ఆకాష్

- Advertisement -

‘ఆనందం’ చిత్రంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ఆకాష్. ఈ సినిమా తర్వాత అతను మంచి స్థాయిలో ఉంటాడని అనుకున్నారు. కానీ కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఆకాష్ కెరీర్ తక్కువ కాలంలోనే ముగిసిందని చెప్పాలి. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కూడా ఆకాష్ చేశాడు. ఆకాష్ ఆమద్య ఇస్మార్ట్ శంకర్ చిత్రం టైంలో ఆ కథ నాది నేను సినిమా తీశాను. రిలీజ్ కు రెడీ చేస్తున్నాను అంటూ మీడియా ముందుకు వచ్చి వివాదం చేశాడు.

మూవీ రిలీజ్ తర్వాత ఏం జరిగిందో కానీ సైలెంట్ అయ్యాడు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆకాష్.. సునీల్ మరియు రవితేజల పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నన్ను ఇండస్ట్రీలో చాలా మంది వాడుకున్నారు. అందాల రాముడు సినిమా షూటింగ్ సమయంలో సునీల్ నా వద్దకు వచ్చి గెస్ట్ రోల్ చేయాల్సిందిగా కోరాడు. సరేనని నేను ఆ పాత్రను చేశాను. సినిమా మంచి విజయం సాధించింది.

సినిమా సక్సెస్ వేడుకలో నన్ను భాగస్వామ్యం చేయకపోవడంతో పాటు.. కనీసం అక్కడ నా పేరును కూడా ప్రస్తావించలేదు. సునీల్ నన్ను మోసం చేశాడంటూ ఆకాష్ ఆసహనం వ్యక్తం చేశాడు. ఇక రవితేజ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కెరీర్ ఆరంభంలో కలిసి నటించాం. మేమిద్దరం ఇప్పటికి స్నేహంగా ఉంటున్నామన్నాడు. ఇండస్ట్రీలో ఒక హీరో ఎదగాలి అంటే ఇంకో హీరోను ఖచ్చితంగా తొక్కేయాల్సిందే అని.. అలా నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టారంటూ ఆకాష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -