నటుడు ,జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ తన పార్టీని నడిపించడానికి పీకల్లోతు అప్పుల్లో కురుకుపోయాడట. అవును ఈ విషయాన్ని స్వయంగా పవనే తన ఎన్నికల అఫిడవిట్‌లో పెర్కొన్నారు. ఆయన గాజువాక శాసనసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ పత్రాలకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్‌లో పవన్ తన ఆస్తులు, అప్పుల గురించి వివరించారు. పార్టీని నడపడానికి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ దగ్గర ఏకంగాయ కోటి రూపాయిలు అప్పు చేశాడట.
అదేవిధంగా తన స్నేహితుడు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దగ్గర కూడా పవన్ రూ.2.4 కోట్లు అప్పు తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తన అప్పు మొత్తం 33 కోట్లు ఉందని చెప్పిన పవన్, తన ఆస్తి రూ.52కోట్లుగా పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు ఐదు ఖరీదైన కార్లు ఉన్నట్లు పవన్ తెలిపారు. ఇవే కాకుండా పలువురు సినీ ప్రముఖులు దగ్గర పవన్ కల్యాణ్ అప్పు తీసుకున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పెర్కొన్నారు.
హారిక హాసిని ప్రొడక్షన్స్: 1.25కోట్లు
M ప్రవీణ్ కుమార్ – 3కోట్లు
MVRS ప్రసాద్: 2 కోట్లు
శ్రీ బాలాజీ సినీ చిత్ర మీడియా: 2 కోట్లు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్: 0.27కోట్లు
వై.నవీన్ కుమార్ – 5.50కోట్లు
ఇలా తన అప్పు మొత్తం 33కోట్లుగా చూపించారు పవన్ కల్యాణ్.
