Sunday, May 19, 2024
- Advertisement -

రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్ డే.. చిరంజీవి ఇంట్లో ప‌వ‌న్ ప్రత్య‌క్షం

- Advertisement -

సినిమాలు వ‌దిలేసి రాజకీయాల్లో బిజీగా ఉన్న న‌టుడు పవన్‌కల్యాణ్. ప్ర‌స్తుతం ఆయ‌న కుమారుడు రామ్‌చ‌ర‌ణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బాబాయి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్యేక గిఫ్ట్ ఇచ్చాడు. చిరంజీవి నివాసంలో ప్రత్యక్షమై ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. రామ్‌చరణ్ జ‌న్మ‌దినం సందర్భంగా వదిన సురేఖ (చిరు భార్య‌) ఆహ్వానం మేరకు పవన్‌కల్యాణ్ నిన్న మంగ‌ళ‌వారం (మార్చి 27) మధ్యాహ్నం భోజ‌నానికి చిరంజీవి ఇంటికి వెళ్లారు. చెర్రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెప్పాడు.

ఆ తర్వాత కుటుంబంతో క‌లిసి ఫొటో దిగారు. ఈ విష‌యాన్ని చెర్రీ భార్య ఉపాసన సోష‌ల్‌మీడియాలో పంచుకున్నారు. చెర్రీ బర్త్ డే సందర్భంగా త‌న అత్తయ్య అమేజింగ్ లంచ్ ఏర్పాటుచేసిందంట‌. ఈ విందుకు త‌న చిన్న‌మావ‌య్య పవర్‌ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా హాజ‌ర‌య్యార‌ని సంతోషం వ్య‌క్తం చేసింది. ఇంట్లో మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్‌లతో మా ఇంటికి పండుగ వాతావరణం వచ్చింది అని చెబుతూ సంతోషంలో మునిగింది.

ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం సినిమా మార్చి 30వ తేదీన విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -