నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రాన్నికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రాన్నికి రికార్డ్ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇటివలే ఈ చిత్రం ముంబై, హైదరాబాద్, చెన్నైలలో వరుసగా మూడు షెడ్యూల్స్‌ని విజయవంతగా కంప్లీట్ చేసింది. ప్రస్తుతం హైదరబాద్ లో షూట్ జరుగుకుంటుంది. ఈ నెల మొత్తం ఇక్కడే షూటింగ్ జరపనున్నారు. ఈ నెల షూటింగ్ తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ముందుగానే చెప్పినట్లు ఆగష్టు 12వ ఈ చిత్రాన్ని రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మాములుగా స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తాయి..కానీ ఈ చిత్రం విషయంలో అలా జరగలేదు.
అనుకున్న సమయాన్నికి అనుకుంనట్లు కంప్లీట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఐఐటీ స్టూడెంట్‌గా కనిపిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మోహన్‌లాల్ ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.