- Advertisement -
తమిళం, కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. నాని నటించిన జెర్సీ ద్వారా తెలుగులో ఆరంగ్రేటం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు.దీంతో సోషల్ మీడియాలో ఆమెను పాలో అవ్వడం ప్రారంభించారు నెటిజన్లు.ఆమె ఇన్స్టాలోని కొన్ని ఫోటోలను చూసిన అభిమానులు ఆమె మెడ కింది ఎడమ భాగంపై ఉన్న టాటూని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ టాటూ రహస్యం తెలుసుకోవాలని అసక్తిగా ఉన్న నెటిజన్లకు రహస్యన్ని ఓ ఇంటర్వూలో చేప్పేసింది. అది ప్రముఖ రాక్ బ్యాండ్ బీటిల్స్ టాటూ అని, ఆ బ్యాండ్ అంటే తనకు చాలా ఇష్టమని, తాను మొదటగా సంపాదించిన డబ్బుతో ఆ టాటూ వేయించుకున్నానని అసలు సంగతి రివీల్ చేశారు.