Wednesday, May 15, 2024
- Advertisement -

మొన్న మహేశ్.. రేపు ఎన్టీఆర్..!

- Advertisement -

‘శ్రీమంతుడు’ సినిమాతో తమిళంలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు మహేశ్ బాబు. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళంలో కూడా ఒకేసారి విడుదల అయ్యింది. సెల్వందన్ పేరుతో అక్కడ విడుదలైంది.

అయితే ఈ సినిమా తెలుగులో హిట్ అయినంత స్థాయిలో తమిళంలో సక్సెస్ కాలేదు. కనీసం డబ్బింగ్ ఖర్చులు కూడా రాలేదని తెలుస్తోంది. తెలుగులో రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించిన ఈ సినిమా తమిళంలో కోటి రూపాయల లోపు స్థాయికే పరిమితం అయ్యింది.

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఎన్టీఆర్ కూడా తమిళంలో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది వరకూ ఎన్టీఆర్ నటించిన శక్తి, దమ్ములాంటి సినిమాలు తమిళంలోకి డబ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా కోలీవుడ్ కు వెళుతోంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల కానుందని తెలుస్తోంది. శ్రీమంతుడు తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదలైనట్టుగా… నాన్నకుప్రేమతో కూడా తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల కాబోతోంది.

మరి శక్తి, దమ్ము, శ్రీమంతుడు.. ఇలా తెలుగు సినిమాలేవీ తమిళంలో అంతగా సత్తా చాటలేకపోయాయి. కేవలం బాహుబలితమిళ వెర్షన్ మాత్రమే పర్వాలేదనిపించుకొంది. ఇక ఎన్టీఆర్ సినిమాకు అక్కడ ఎలాంటి రిజల్ట్ వస్తుందో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -