అభిమానుల కోసం ఎన్టీఆర్ చాలా పెద్ద త్యాగమే చేశాడు. చేయకతప్పని పరిస్థితి ఎన్టీఆర్‌ది. గతంలో బాద్ షా సినిమా టైంలో కూడా తాను అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా అనుకోని కారణాల రీత్యా స్పాయిల్ అయిన పరిస్థితి. బాద్షా సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేశాడు ఎన్టీఆర్. ఆ లుక్‌ని సినిమా రిలీజ్ టైంలో మాత్రమే రివీల్ చేయాలనుకున్నాడు. కానీ లోకేష్‌కి పోటీ అవుతాడేమో అని భయపడి 2009 ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రాణాలకు తెగించి మరీ ప్రచారం చేసిన ఎన్టీఆర్ విషయంలో దారుణంగా ప్రవర్తించాడు చంద్రబాబు. ఎన్టీఆర్ టిడిపికి ద్రోహం చేస్తున్నాడని, జగన్‌తో కుమ్మక్కయ్యాడని విష ప్రచారం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కి మీడియా ముందుకు రాక తప్పలేదు.
అయితే ఈ సారి మాత్రం తాను ఎంతగానేమో ప్రేమించే అన్న కళ్యాణ్ రామ్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం రాకూడదన్న నిర్ణయం తీసుకున్నాడు. టెంపర్ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు ఎన్టీఆర్. అయితే అది అంత ఎఫెక్టివ్‌గా కనిపించలేదు. ఇక నాన్నకు ప్రేమతో సినిమాలో క్యారెక్టరైజేషన్ రీత్యా ఎక్కడా కూడా కంప్లీట్ యంగ్ అండ్ జోష్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. లుక్ అదిరిపోయినప్పటికీ అంతా సీరియస్ వ్యవహారం అన్నట్టు ఉంటుంది. అంతకుముందు రామయ్యా వస్తావయ్యాలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. అయితే ఈ సారి మాత్రం అన్ని లోపాలు సరిదిద్దుకుని కంప్లీట్ క్లాస్ అండ్ యంగ్ లవర్ బాయ్ లుక్‌లో కనిపించే ప్రయత్నంలో ఉన్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ స్టైల్లో ఎన్టీఆర్ లుక్ ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ తరం ఆడియెన్స్‌కి…… టీనేజ్ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా సిక్స్ ప్యాక్‌తో ఉండే అల్ట్రా మోడరన్ యూత్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఈ లుక్ గురించే ఇండస్ట్రీలో చాలా మంది చాలా గొప్పగా చెప్తున్నారు. త్రివిక్రమ్ సినిమాలో ఇంతకు ముందు ఎన్నడూ చూడనంత యంగ్ అండ్ ఎనర్జిటిక్….జోష్‌ఫుల్ క్యారెక్టర్లో ఎన్టీఆర్‌ని మనం చూడబోతున్నాం. కాలేజ్ స్టూడెంట్ స్థాయి ఎనర్జీతో……వెరీ యంగ్ అండ్ హ్యాండ్సమ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించడానికి…….ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్.