తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు నిరాశకు గురి చేశాయి.ఈ రోజు వెలువడుతున్న ఫలితాలలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.ఎంతలా అంటే టీడీపీకి కంచుకోట అయిన కూకట్‌పల్లిలలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి దివంగత నటుడు,ఎంపీ హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని బరిలో నిలిపారు ఏపీ చంద్రబాబు.
ఇక్కడి ప్రజలు మొదటి నుంచి టీడీపీకి అండా నిలుస్తు వస్తున్నారు.కాని ఈసారి సీన్ రివర్స్ అయింది.కూకట్‌పల్లి ప్రజలు ఈసారి ఇక్కడ టీడీపీకి షాక్ ఇచ్చారు.ఫలితాలలో సుహాసిని వెనకపడ్డారు.దాదాపు ఆమె ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఆమెకు ఓడిపోయే సీటు అప్పగించారని మొదటి నుంచి నందమూరి కుటుంబం బాబుని విమర్శిస్తుంది.దీని కారణంగానే ఎన్టీఆర్,కల్యాణ్ రామ్‌లు ఆమె తరుపున ప్రచారం కూడా చేయలేదు.ఇప్పుడు ఫలితాలు తరువాత వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ