Friday, May 9, 2025
- Advertisement -

‘భ‌ర‌తుడి’ సినిమాపై స్పందించిన ఎన్టీఆర్‌

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజా చిత్రం ‘భ‌ర‌త్ అను నేను’ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.సినిమాలో మ‌హేష్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుతున్నా యి. టాలీవుడు ప్ర‌ముఖ‌లు సినిమాను అభినందిస్తున్నారు.మొన్న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సినిమాను చూసి భ‌ర‌త్ అను నేను టీంపై త‌న ట్వీట్ట‌ర్ ద్వారా అభినంద‌న‌లు తెలిపారు.ఇప్పుడు మ‌రో స్టార్ హీరో మ‌హేష్ సినిమా బావుందని ట్వీట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.ఆ హీరో మ‌రెవ్వ‌రో కాదు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.స్పెషల్ గా సినిమాను వీక్షించి తారక్ చిత్ర యూనిట్ ని అభినందించారు. ముఖ్యంగా హీరో మహేష్ చాలా అద్భుతంగా నటించారు అని ఆయన లాగా డిఫరెంట్ క్యారెక్టర్లు ఎవరు చేయలేరని చెప్పారు.

ఒక సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ సినిమా తెరకెక్కించడమంటే ఈజీ కాదు. చాలా బాద్యతతో కూడుకున్నది. దర్శకుడు కొరటాల తన ప్రతిభను మరోసారి చూపించారు. భరత్ అనే నేను సినిమాలో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని నిజాయితీగా తీసిన ఈ సినిమా చరిత్రలోనే ఒక మంచి సినిమాగా నిలిచిపోతుందని తారక్ సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలియజేశారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తారక్ వచ్చి ఎలా సందడి చేశాడో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ కూడా మహేష్ అన్నా అని సంభోదించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -