Friday, May 9, 2025
- Advertisement -

సింహాద్రి రేంజ్ లో జనతా గ్యారేజ్!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ ఈ మధ్యనే చెన్నైలో కొద్దిగా షూటింగ్ ఫ్యాన్స్ తో సేల్ఫీ ఫోటోలు తీసుకుంటూ అక్కడ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ని బయటపెట్టింది. కాగా ఆ క్రేజ్ తోనే అక్కడ రికార్డు స్థాయిలో డబ్బింగ్ బిజినెస్ కూడా చేసింది. కాగా అక్కడ అభిమానులు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకోగా ఎన్టీఆర్ సంతోషంగా చిరునవ్వుని నవ్వాడు.

కాగా యూనిట్ లో వర్గాలు సినిమా రేంజ్ ఎలా ఉంటుందో అభిమానులతో పంచుకున్నారు. వారు సినిమా సింహాద్రి రేంజ్ హిట్ అవ్వాలని కోరుకోగా యూనిట్ వాళ్ళు మాత్రం సింహాద్రి రేంజ్ హిట్ అనేది అందరు ప్రేక్షకుల చేతిలో ఉంటుందని కానీ సినిమా అవుట్ పుట్ మాత్రం కచ్చితంగా ఆది రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఎన్టీఆర్ తొలినాళ్ళలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆది సినిమా స్థాయిలో జనతాగ్యారేజ్ ఉండబోతుంది అని చెప్పడంతో అది చాలు ఆ స్థాయిని సింహాద్రి రేంజ్ కి తీసుకెళతామని ఫ్యాన్స్ చెప్పారట. టెంపర్-నాన్నకుప్రేమతో లాంటి రెండు హిట్స్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ బోలెడు అంచనాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -