Saturday, May 10, 2025
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌, రాజ‌మౌలి మ‌ల్టీస్టార్‌ర చిత్రాల‌పై స్పందించిన జూ.ఎన్టీఆర్‌…

- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌, రాజ‌మౌలి మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌లో న‌టించే విష‌యంలో తొలిసారిగా స్పందించారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. యంగ్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

రాజమౌళి ఇంకా ఆ సినిమా కథ పూర్తిగా చెప్పలేదని, సినిమాకు సిద్ధం కావాలని అన్నారని వ్యాఖ్యానించారు. ఆయన నోరు విప్పిన తరవాత మేం మాట్లాడితే బాగుంటుంది. ఒకటి మాత్రం చెప్పగలను ఇది మా ముగ్గురి మధ్య ఆరోగ్యవంతమైన పోటీ. మంచి సినిమా అవుతుంది’ అని ఎన్టీఆర్ వివరించారు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో మీరు చేస్తున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నాకేం కబురు రాలేదండి. మీకేమైనా వస్తే చెప్పండి. ఇంకా నన్ను సంప్రదించలేదు. ఒక వేళ నాకు ఏదైనా పాత్ర ఇస్తే ముందు మీకు చెప్పి నేను నిర్ణయం తీసుకుంటాను’ అంటూ తారక్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఐపీఎల్ మ్యాచుల తెలుగు ప్రచార‌క‌ర్త‌గా ఎన్నికైన‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ రోజు ఐపీఎల్ నిర్వాహ‌కులు హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -