Wednesday, April 24, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ రెస్పాన్స్ పై యంగ్ టైగ‌ర్ స్పంద‌న‌

- Advertisement -

ఆర్.ఆర్.ఆర్ కు వస్తున్న స్పందన చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. యంగ్ టైగ‌ర్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ … ఆయనకు తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ మూవీలో భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో మరోసారి తానేంటో నిరూపించాడు. అనూహ్య స్పందన రావటంతో ఎన్టీఆర్ అభిమానులకు తన సోషల్ మీడియా పేజ్‌ల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

తన పట్ల నిస్వార్థంగా ప్రేమ కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్…. అభిమానుల ప్రేమానురాగాలే తనను ముందుకు నడిపిస్తాయన్నారు. అద్భుతమైన విజువల్ వండర్‌ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చూడాలని అందరినీ కోరారు.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొంరం భీమ్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నారు. ఎన్టీఆర్ వైవిధ్య పాత్ర‌లో క‌నిపించ‌డంతో ఆయ‌న అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -