తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు రాఘవేంద్రరావుకి సముచిత స్థానం ఉంది. ఇండస్ట్రీ మొత్తం ఆయనను గౌరవిస్తారు. ఆ ఎన్టీఆర్ ఈ ఎన్టీఆర్ వరుకు హిట్లు ఇచ్చిన ఘనత ఆయన సొంతం. మరి అలాంటి ఆయన ఇంటి సభ్యులు ఎలా ఉండాలి . రాఘవేంద్రరావు పరువు నిలబెట్టేలా ఉండాలి.కాని ఆయన కొడలు కనిక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
రాఘవేంద్రరావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్య కనిక స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. షారుఖ్ నటించిన ‘జీరో’ సినిమా ఇటీవల విడుదలై , డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వీరిపై రెచ్చిపోయి కామెంట్స్ చేసింది కనిక. ‘జీరో’ సినిమాతో మరోసారి కొత్తదనం పంచారని, షారుఖ్ లాంటి పెద్ద స్టార్ ఉన్నారని చూడకుండా వైవిధ్యంగా సినిమాను నడిపించారని.. ఇలాంటి కొత్తదనం ఉన్న సినిమాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సినిమాను సినిమాలా చూడండి అంటూ నెటిజన్లకు హితవు పలికింది. సినిమా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. సినిమా చూడటం రానివారే ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారని అంటోంది కనిక. కనిక చేసిన పోస్ట్‌కు షారుఖ్ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ