Thursday, May 9, 2024
- Advertisement -

ఏప్రిల్‌ 23న విడుదలకు సిద్ధమవుతున్న ‘కాయ్‌ రాజా కాయ్‌’

- Advertisement -

ఫుల్‌మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శివగణేష్‌ దర్శకత్వంలో రామ్‌ఖన్నా, మానస్‌, షామిలి, శ్రావ్య హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘కాయ్‌ రాజా కాయ్‌’.

మారుతి టాకీస్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మారుతి వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా వర్క్‌ చేసిన శివగణేష్‌ ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూత్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జె.బి సంగీతం అందిస్తున్నారు. 

‘లవర్స్‌’ వంటి భారీ సక్సెస్‌ అనంతరం ‘మారుతి టాకీస్‌’ బ్యానర్‌ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రంపై అటు ప్రేక్షకుల్లో` ఇటు చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి.

 ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివగణేష్‌ మాట్లాడుతూ… ‘రామ్‌ఖన్నా, మానస్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జోష్‌ రవి ముఖ్యపాత్ర పోషించాడు. సాఫీగా సాగిపోయే ముగ్గురు కుర్రాళ్ల జీవితంలో ‘కాయ్‌ రాజా కాయ్‌’ ఆట ఎటువంటి పెనుమార్పులకు దారి తీసింది అనేది చిత్ర కథాంశం. మాస్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరిగా ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రాన్ని తెరకెక్కించాను. మారుతిగారు అందించిన ప్రోత్సాహంతోనే ఈ చిత్రానికి దర్శకుడిగా మారగలిగాను. అలాగే ఫూల్‌మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు ఖర్చుకి వెనకాడకుండా మంచి సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగాను. ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రాన్ని యూత్‌తోపాటు కామన్‌ ఆడియన్స్‌ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.

మారుతి మాట్లాడుతూ… ‘శివగణేష్‌ కొత్తవాడైనా ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. మారుతి టాకీస్‌ బ్యానర్‌ నుంచి వస్తున్న ఈ చిత్రం మరో సూపర్‌ హిట్‌గా నిలుస్తుందన్న పూర్తి నమ్మకం నాకుంది’ అన్నారు! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -