Friday, March 29, 2024
- Advertisement -

తాజ్ మహల్ కి ముద్దులు ఇస్తున్న కాజల్ అగర్వాల్

- Advertisement -

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సినిమాల తో బిజీ గా ఉంది. గత కొంత కాలం గా తీరిక లేకుండా పని తో నిమగ్నమై ఉండటం తో ఎట్టకేలకు కాస్త సమయం తీసుకొని ఇప్పుడు ఫ్యామిలీ తో విహార యాత్ర కి వెళ్ళింది. అది కూడా తాజ్ మహల్ వీక్షించింది కాజల్.

“ఒక్కసారిగా తాజ్ మహల్ ని చూడగానే, అది కూడా మొదటి సారిగా, నేను అలా మైమరచిపోయాను. అసలు ఆ అందానికి నాకు నోట మాట రాలేదు. తాజ్ మహల్ చాలా అద్భుతం గా ఉంది. ఇప్పటి వరకు ఈ అందం గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పడం విన్నాను కానీ మొదటి సారి గా నా జీవితం లో ఈ ఆర్కిటెక్చర్ కి సంబంధించి, ఆ డిటైలింగ్స్ కి సంబంధించి ఇంకా ఆ నిర్మాణం గురించి చాలా విషయాలు తెలుసుకోవడం వలన ఒక్కసారిగా హిస్టరీ లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఈ అందం, నా మైండ్ లో ఒక చెరగని ముద్ర వేసింది.” అని కాజల్ అగర్వాల్ చెప్తూ తాజ్ కి ముద్దు ఇస్తూ ఒక ఫోటో దిగింది. ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -