Tuesday, April 30, 2024
- Advertisement -

‘కండోమ్ ఫ్యాక్టరీ’లో కళ్యాణ్ దేవ్

- Advertisement -

ఈ మధ్యనే మెగా హీరోల జాబితాలో చేరిన కొత్త పేరు కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు గా కళ్యాణ్ దేవ్ ‘విజేత’ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే మొదటి సినిమాతో మంచి హిట్ ను అందుకోలేకపోయాడు. ఆ సినిమా తర్వాత చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కళ్యాణ్ దేవ్ ‘మీనాక్షి’ అనే సినిమాని మొదలు పెట్టారు కాని ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. సినిమా ఆగిపోవడానికి కారణం బడ్జెట్ అని కొందరు అంటున్నారు కానీ అందులో నిజానిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా కళ్యాణ్ దేవ్ పులి వాసు దర్శకత్వంలో ఒక సినిమా ని సైన్ చేశారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కి ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ‘కండోమ్ ఫ్యాక్టరీ’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇది ఒక పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమా కథ ప్రకారం 1980లలో ఒక కండోమ్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి గా కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే టైటిల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. ఒకవేళ సినిమా టైటిల్ కండోమ్ ఫ్యాక్టరీ అయితే విడుదల అయ్యే లోపల సినిమా ఎన్ని వివాదాలకు తెర తీస్తుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టనున్నారు మెగా అల్లుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -