నందమూరి హీరోలలో కల్యాణ్ రామ్ కూడా ఒకరు. కల్యాణ్ రామ్‌కు ఇండస్ట్రీలో సౌమ్యుడు అనే పేరుంది. కాని కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇప్పటి వరకు మంచి హిట్ పడలేదనే చెప్పాలి. కల్యాణ్ రామ్ ఎన్నో సినిమాలు చేసినప్పటికి అతని వచ్చిన హిట్లు మాత్రం చాలా తక్కువే. పటాస్ తరువాత్ కల్యాణ్ రామ్‌కు ఇప్పటి వరుకు మరో హిట్ లేదు. హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన లాభం లేకపోయింది. కల్యాణ్ రామ్ తాజాగా హీరోగా నటించిన చిత్రం 118. సినిమాటోగ్రాఫర్ గుహాన్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్‌ను చూస్తుంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. సినిమా తప్పకుండా సరికొత్త విజువల్ ట్రీట్ తో పాటు మంచి యాక్షన్ ఎంటర్టైనర్ చూసిన అనుభూతిని కలిగిస్తుందని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది.కల్యాణ్ రామ్ దేనికోసమో వెతుకుతున్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌ను చూస్తుంటే చాలాబాగుందని అనిపిస్తోంది. ట్రైలర్‌కు యూట్యూబ్‌లో పాజిటివ్ రెస్పెన్స్ వచ్చింది. మరి కల్యాణ్ రామ్ ఈ సినిమాతో అయిన హిట్ కొడతాడో లేదో చూడాలి. 118లో కల్యాణ్ రామ్ సరసన షాలిని పాండే, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. మార్చి నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
కల్యాణ్ రామ్ హిట్ కొట్టేలా ఉన్నాడే…!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -