Saturday, April 20, 2024
- Advertisement -

‘118’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

- Advertisement -

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం 118. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు ప్ర‌ముఖ ఫోటోగ్రాఫ‌ర్ గుహాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నివేదా థామ‌స్‌, షాలినీ పాండేలు న‌టించారు. స‌స్పెన్స్‌,థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా మొద‌టి రోజున మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. టాక్‌కు త‌గినట్లుగానే క‌లెక్ష‌న్లు కూడా యావ‌రేజ్‌గా ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 1.42 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. ‘118’ ఏపీ.. తెలంగాణా థియేట్రికల్ రైట్స్ ను 6 కోట్ల రూపాయలకు దిల్ రాజు తీసుకున్నారు. ఇప్ప‌ట్లో విడుద‌ల అయ్యే సినిమాలు పెద్ద‌గా ఏమి లేక‌పోవ‌డం ఈ సినిమాకు క‌లిసి వ‌చ్చే అంశం. పైగా ఆదివారం, సోమ‌వారం శివ‌రాత్రి ఇలా వ‌రుస సెల‌వులు ఉండ‌టంతో సినిమాకు మ‌రింత క‌లెక్ష‌న్లు పెరిగే అవ‌కాశం ఉంది.

ఏపీ తెలంగాణా రాష్ట్రాలలో ‘118’ మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 0.51 cr
సీడెడ్: 0.23 cr
ఉత్తరాంధ్ర: 0.17 cr
కృష్ణ: 0.12 cr
గుంటూరు: 0.17 cr
ఈస్ట్ : 0.09 cr
వెస్ట్: 0.07 cr
నెల్లూరు: 0.04 cr
టోటల్: రూ.1.40 cr

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -