లోకనాయకుడు కమల్ హాసన్ నిన్న(శుక్రవారం) జరిగిని తెలుగు బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో తళుక్కున మెరిశారు.ఆయన నటించిన విశ్వరూపం-2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.కమల్ సడన్ ఎంట్రీ చూసి హోస్‌మెట్స్ అందరు షాక్ గురైయ్యారు.ఇక కమల్ పోటీదారులతో కాసేపు సరదాగా గడిపారు. సినిమా ట్రైలర్ ను ఇంటి సభ్యులకు చూపించారు. హీరోయిన్ పూజ, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, సినిమాటోగ్రాఫర్ దత్ లను కూడా తీసుకు వచ్చి వారిని పరిచయం చేశారు.కమల్ ను అలరించేందుకు అమిత్, రోల్ రైడా, గీతా మాధురిలు తమ టాలెంట్ ను ప్రదర్శించారు.
కమల్ సైతం ‘భారతీయుడు’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘అదిరేటి డ్రస్సు మీరేస్తే’ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశారు. ఇక కమల్ హోస్‌మెట్స్‌లో ఒకరి బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పారు.హౌస్ లోని ఒకరికి రెండు వారాల పాటు ఎలిమినేట్ కాకుండా పవర్ ను ఇస్తానని చెప్పిన కమల్,ఆ ఆఫర్‌ను అమిత్ ఇచ్చాడు.దీంతో సంభ్రమాశ్చర్యాలకు గురైన అమిత్, కమల్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో అమిత్‌ను రెండు వారాల పాటు ఎవరు నామినేట్ చేయకూడదు.