Wednesday, May 14, 2025
- Advertisement -

తెలుగు ప్ర‌జ‌ల‌కు క‌మ‌ల్, త‌లైవా కృత‌జ్ఞ‌త‌లు…

- Advertisement -

‘‘త‌న‌కు మొద‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తున్న తెలుగు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు.. మీ రుణాన్ని ఎప్ప‌టికీ తీర్చుకోలేను’’ అని సీనియ‌ర్ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ తెలిపారు. త‌న‌కు ఎన్టీఆర్ జాతీయ పుర‌స్కారం ల‌భించ‌డంపై ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ‘‘2016 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికైన రజినీకాంత్‌కు అభినందనలు. నాకు మరోసారి గౌరవం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా కెరీర్ ఆరంభం నుంచి నాకెంతో మద్దతు ఇస్తున్నారు. మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను’’ అని తెలిపారు. చివ‌ర‌లో తెలుగులో ‘కృతజ్ఞ‌తలు’ అని చెప్పారు. ఆయన గతంలో తెలుగులో చేసిన కొన్ని సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. త‌న సినిమాల‌కు తెలుగు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లికుతూనే ఉన్నారు.

త‌లైవా కృత‌జ్ఞ‌త‌లు

2015 ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికైన త‌మిళ త‌లైవా ర‌జనీకాంత్ కూడా స్పందించారు. ‘నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుకు న‌న్ను ఎంపిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు’ అని ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బీఎన్‌రెడ్డి జాతీయ‌ అవార్డు, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2014లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎంపికవగా, 2015 పురస్కారాన్ని రజనీకాంత్‌కు, 2016కు గాను కమల్ హాసన్‌కు ఈ అవార్డులు ద‌క్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -