Sunday, May 5, 2024
- Advertisement -

హీరోయిన్ ర‌ష్మిక కటౌట్‌కు పాలాభిషేకం

- Advertisement -

సినిమా హీరోల‌కు చాలామంది అభిమానులు ఉంటారు. అభిమాన హీరోల సినిమాలు విడుద‌ల అవుతుంటే వారు చేసే హంగామా అంత ఇంత కాదు. అభిమాన హీరోల భారీ కటౌట్‌లు క‌ట్టి వారిపై అభిమానాన్ని చాటుకుంటారు అభిమానులు.పాల‌భిషేకాలు, పూల దండ‌లు ఇలా తెగ హ‌డ‌విడి సృష్టిస్తారు. కాని హీరోయిన్స్‌పై అభిమానం ఉన్న‌ప్ప‌టికి వాటిని బ‌య‌టికి ప్ర‌ద‌ర్శించరు. కాని సినీ చరిత్రలో ఫ‌స్ట్ టైం ఓ హీరోయిన్‌కు కూడా హీరోతో స‌మానంగా కటౌట్ క‌ట్టి పాలభిషేకం చేశారు. ర‌ష్మిక చేసింది త‌క్క‌వ సినిమాలే అయిన తెలుగు క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌లో పెద్ద చోటునే సంపాదించుకుంది. క‌న్న‌డ కిర్రాక్ పార్టీ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచియమైన ఈ భామ తెలుగులో కూడా త‌న స‌త్తాను చాటింది.

ఛ‌లో, గీతా గోవిందం వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర అయింది. ర‌ష్మిక తాజాగా క‌న్న‌డ‌లో న‌టించిన చిత్రం యజమాన. ఈ సినిమాలో హీరోగా ద‌ర్శ‌న్‌ న‌టించాడు. రెండు రోజుల క్రితం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ర‌ష్మిక అభిమానులు మైసూర్ సిటీలోని ఒక థియటర్ వద్ద ఆమె అభిమానులు కొందరు ఆమె భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ర‌ష్మిక కటౌట్‌కు పాలాభిషేకం చేయడంతో పాటు పెద్ద దండను అలంకరించారు. ఓ హీరోయిన్‌కు క‌టౌట్ క‌ట్టి ,పాలాభిషేకం చేయడం ఇలా సినీ చ‌రిత్రలో ఫ‌స్ట్ టైం అని చాలామంది చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -