విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్ తమ పాత్రల షూటింగ్‌ని పూర్తి చేయగా తాజాగా మేకర్స్ అదిరే అప్‌డేట్ ఇచ్చారు.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ నెల 20న టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ని ఆవిష్కరించనుండటం చాలా ఆనందంగా ఉందన్నారు మంచు విష్ణు.
ప్రపంచ ప్రేక్షకులకు మేం ఎంతో ఇష్టంగా రూపొందించిన కన్నప్పను ప్రదర్శించడానికి కేన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
