- Advertisement -

కార్తీ …’అన్నగారు వస్తారు’!

- Advertisement -

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు కార్తీ. వైవిధ్యమైన సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కార్తీ తాజాగా మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నారు.

స్టూడియో గ్రీన్ సంస్థ, కార్తీ తదుపరి చిత్రం ‘వా వాతియార్’ ను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. చిత్ర యూనిట్ ఇప్పటికే లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. విడుదల తేదీని ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ చిత్రానికి నళన్ కుమారసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కార్తీ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఆవారా’ తెలుగులో నవంబర్ 22, 2025న రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -