ఈ మధ్య హీరోలకు తాము ఏమాత్రం తీసిపోమని నిరుపిస్తున్నారు మన హీరోయిన్లు. హీరోలతో పాటు సమానంగా హీరోయిన్లు కూడా యాక్షన్ సన్నివేశాలను చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటి సీన్ ఒకటి చేయబోయి గాయాలపాలైంది ఓ హీరోయిన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ సినిమా కోసం ఎంతటి కష్టాన్ని అయిన భరిస్తోంది. గతంలో ఆమె నటించిన సినిమాలలో హీరోలతో పాటు సమానంగా యాక్షన్ సన్నివేశాలు చేసి సూపర్ అనిపించుకుంది.
తాజాగా కత్రిన సల్మాన్‌తో కలిసి భరత్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్‌లో ప్రమాదవశాత్తు కత్రినా గాయపడిందట. ఆమె కాలుకు గాయం కావడంతో షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిందట కత్రినా. కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం తిరిగి ఈ సినిమా షూటింగ్‌లో నటించనుంది కత్రినా. సల్మాన్‌తో కత్రినా నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమా కూడా తనకు మంచి విజయాన్ని అందిస్తోందని కత్రినా భావిస్తోంది. ఈ సినిమాలో దిశా పటానీ సల్మాన్‌కు చెల్లెలుగా నటిస్తుంది.
- Advertisement -
షూటింగ్‌లో హీరోయిన్‌కు గాయాలు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -