Saturday, April 20, 2024
- Advertisement -

స్టార్ హీరోల పై విరుచుకుపడిన కట్టప్ప

- Advertisement -

ప్రముఖ నటుడు సత్యరాజ్ తమిళ ప్రేక్షకులకే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్ర లో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సత్య రాజ్ తాజాగా రజినీకాంత్ మరియు కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ స్టార్ హీరోలు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాల్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో మాట్లాడుతూ కమల్ హాసన్, రజనీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చి తీర్చాల్సిన లోటు అంటూ ఏమీ లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న డీఎంకే మరియు ఏఐడీఎంకే పార్టీలు చాలా సంవత్సరాలుగా ప్రజల కోసం చేతనైనంత చేస్తున్నారని, అలాంటి రెండు పెద్ద పార్టీల తో పోటీ పడటం కేవలం వెర్రితనం మాత్రమే అని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇప్పటికే రాజకీయాల్లో ప్రజల కోసం పాటుపడే నాయకులు చాలామంది ఉన్నారని, కాబట్టి మిగతా వాళ్లు తమ పని తాము చూసుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. మరి కమల్ హాసన్, రజనీకాంత్ సత్యరాజ్ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతారో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -