కీర్తి సురేష్ …తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. మహనటి సినిమాతో మరో లెవల్‌కు వెళ్లింది కీర్తి సురేష్. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ సినిమా తరువాత అచితూచి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
తమిళంలో స్టార్ హీరోల సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ , ఇదే సమయంలో తెలుగులో మాత్రం ఎటువంటి సినిమాలు అంగీకరించడం లేదు. తాజాగా తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ కథ కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు కీర్తి ఓకే చెప్పిందని తెలుస్తోంది. డేట్స్ కూడా ఇచ్చేసిందని వార్తలు వస్తున్నాయి.. ఈ మూవీని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మించబోతున్నాడట. సంక్రాంతి తరువాత ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’