Wednesday, May 1, 2024
- Advertisement -

సరిలేరు నీకెవరు లో ‘ఒక్క ఛాన్స్’ భామ

- Advertisement -

ఈ మధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెండితెరకు దూరం అయిన సీనియర్ నటి విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గత కొంతకాలంగా రాజకీయాల్లోనే బిజీగా ఉన్న విజయశాంతి ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కోసం అనిల్ రావిపూడి మరుగున పడిపోయిన మరొక నటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఆమె ఎవరో కాదు సంగీత. ‘ఖడ్గం’, ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగీత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని పాత్రలు చేసింది. తెలుగుకంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన సంగీత పెళ్లి తర్వాత సినిమాల జోలికి వెళ్ళలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించేందుకు సంగీత ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ఒకప్పటి హీరోయిన్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -