పార్టీలు , పబ్‌ల్లో ఎంజాయ్ చేయలంటే బాలీవుడ్ తరువాతే ఎవరైనా. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లు తరచ ఏదో ఒక పార్టీలు చేసుకుంటు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి పార్టీనే ఒకటి బాలీవుడ్‌లో తాజాగా ఒకటి జరిగింది.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ గెట్ టుగెదర్ ను ఏర్పాటు చేయగా బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు ఈ పార్టీకి హాజరైయ్యారు. సోనాక్షి సిన్హా,తారా సుతారియ,అదితి రావు హైదరీ, అనన్య పాండే, కియారా అద్వాని, వరుణ్ ధావన్ మొదలగు వారు ఈ పార్టీకి హాజరైయ్యారు.
వరుణ్ ధావన్,కియారా,సోనాక్షిలు తమ డ్యాన్స్‌తో అక్కడ ఉన్నవారిని అలరించారు. ముఖ్యంగా కియారా అద్వాని తన అద్భుతమైన డ్యాన్స్ అక్కడ హల్ చల్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే కియారా అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటిస్తుంది. ఈ సినిమాలో హీరోగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తెలుగులో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
- Advertisement -
పబ్ పార్టీలో డ్యాన్స్‌తో హల్ చల్ చేసిన కియారా అద్వాని
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -