Saturday, April 27, 2024
- Advertisement -

అమీర్ ఖాన్ కు పట్టిన గతే.. విజయ్ కి కూడా ?

- Advertisement -

ప్రస్తుతం బాలీవుడ్ లో విడుదల అవుతున్న కొత్త చిత్రాలపై ” బాయ్ కాట్ ” విపరీతంగా వెంటాడుతోంది. గతంలో అమీర్ ఖాన్ వ్యాఖ్యలను బయటకు తీస్తూ.. ఆ కసినంతా ” లాల్ సింగ్ చద్దా ” పై చూపించారు నెటిజన్స్. ” లాల్ సింగ్ చద్దా ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ ను స్ప్రెడ్ చేశారు కొందరు. అంతే కాకుండా ” బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా ” అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. దీంతో ఆ ఇంపాక్ట్ మూవీ పై గట్టిగానే ప్రభావం చూపింది. ఒకప్పుడు వేల కోట్లు వసూలు చేసిన అమీర్ ఖాన్ ఇప్పుడు 60 కోట్లు రాబట్టడమే గగనం అయిపోయిందంటే ” బాయ్ కాట్ ” ప్రభావం ఆ మూవీపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక అమీర్ ఖాన్ ” లాల్ సింగ్ చడ్డా ” మూవీకి మద్దతు గా నిలిచిన హృతిక్ రోషన్ కు కూడా ఆ సెగ తగిలింది. హృతిక్ ” విక్రమ్ వెధ ” మూవీ ని కూడా బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు నెటిజన్స్. ఇక తాజాగా విజయ్ వంతు వచ్చింది. ఇప్పటివరకు లైగర్ పై మంచి హైప్ ఉన్న నేపథ్యంలో విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ” బాయ్ కాట్ లైగర్ ” అని ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవల లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా బాయ్ కాట్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ.

ఇంతకీ విజయ్ ఏమన్నాడంటే..” బాయ్ కాట్ చేయాలని ట్రెండ్ చేసే వాళ్ళను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వాళ్ళు ఎలా ట్రెండ్ చేసిన.. మూవీ నచ్చిన వాళ్ళు థియేటర్ కు వెళ్ళి చూస్తారు.. లేదంటే ఓటిటీ లో చూస్తారు…” అని విజయ్ బాయ్ కాట్ విషయంలో లైట్ తీసుకోవడంతో కొందరు నెటిజన్స్ విజయ్ తాజా మూవీని ” లైగర్ ” ను టార్గెట్ చేశారు. ” బాయ్ కాట్ లైగర్ ” అని ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీనికి ధీటుగా విజయ్ అభిమానులు ” ఆన్స్టాపబుల్ లైగర్ ” అని మరో రకంగా ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ బాయ్ కాట్ సెగ విజయ్ కి ఎంతమేర తగులుతుందో చూడాలి.

Also Read : వామ్మో.. లైగర్ లో అన్నీ బూతులా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -