Friday, April 19, 2024
- Advertisement -

భరత్ అనే నేను బ్యూటీ డేటింగ్ చేస్తుందా???

- Advertisement -

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర కథనాయికల్లో దూసుకుపోతున్న నటుల్లో ఒకరు కియారా అద్వానీ. ఎం ఎస్ ధోని బయోపిక్ లో ఎం స్ ధోని కి భార్య పాత్ర లో నటించిన కియార అద్వానీ అందరి ప్రశంసలు పొందింది. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో భరత్ అనే నేను సినిమా తో అరంగేట్రం చేసి అభిమానులను సొంతం చేసుకుంది.

భరత్ అనే నేను తరువాత వినయ విధేయ రామ లో మెరిసినా, ఆ సినిమా పరాజయం పాలు అవడం తో కియార అద్వానీ పడిన శ్రమ పెద్దగా ఉపయోగం లేకుండా అయింది. అయితే ఇప్పుడు తాజా గా కబీర్ సింగ్ సినిమా లో షాహిద్ కపూర్ సరసన నటించిన కియార అద్వానీ ఈ సినిమా తనకి తప్పకుండా విజయాన్ని అందిస్తుంది అనే నమ్మకం తో ఉంది. అర్జున్ రెడ్డి సినిమా కి ఇది రీమేక్ గా విడుదల అవబోతుంది.

అయితే బాలీవుడ్ లో ఎప్పటికీ అప్పుడు వచ్చే రిలేషన్ షిప్ రూమర్స్ లో కీయార అద్వానీ కూడా చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. సిద్దార్థ్ మల్హోత్రా తో కీయారా అద్వానీ డేటింగ్ లో ఉంది అనే రూమర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. వీళ్లిద్దరూ కలిసి ప్రస్తుతం షేర్ షా అనే సినిమా లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు హీరో కానీ హీరోయిన్ కానీ ఈ లింక్ అప్ రూమర్ మీద స్పందించలేదు కానీ మరి కొద్ది రోజుల్లో వీరి రిలేషన్ షిప్ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -