బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో ఆమె నటించిన వినయ విధేయ రామ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న కియారా మీడియాతో సినిమా విశేషాలను పంచుకుంది. భరత్ అనే నేను సినిమా నా కెరీర్‌ను మార్చేసిందని చెప్పుకొచ్చింది.
ఇక వినయ విధేయ రామ కూడా తనకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది కియారా. తన బాలీవుడ్ సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చింది కియారా. అర్జున్‌రెడ్డి బాలీవుడ్ రీమేక్‌లో హీరోయిన్గా నటిస్తుంది కియారా. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుందని చెప్పుకొచ్చింది. మీరు ఎవ్వరితో అయిన డేటింగ్ చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తు… నేను ఎవ్వరితోను డేటింగ్లో లేనని, ఇలాంటి వార్తలను నమ్మోద్దని వెల్లడించింది ఈ భామ.
తానెవ్వరితో డేటింగ్ లో లేనని – అయినా నాకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని చెప్పుకొచ్చింది. తాను చేసే సినిమాలను ప్రేమిస్తున్నానని – సినిమాలనే పెళ్లి చేసుకున్నానంటూ చెప్పుకొచ్చింది.ఇక తెలుగులో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా కియారానే హీరోయిన్గా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!