Thursday, May 8, 2025
- Advertisement -

భ‌ర‌త్ అనే నేను 2 సీక్వెల్ నిజ‌మేనా..

- Advertisement -

టాలీవుడ్ యాక్టర్ మహేశ్‌బాబు నటిస్తోన్న భరత్ అనే నేను తాజా చిత్రం శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. కోర‌టాల శివ‌,మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాలో భ‌ర‌త్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.

మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సోషల్‌మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేసింది కైరా. ప్రత్యేకించి ప్లాన్ ఏమీ చేసుకోలేదు. కొరటాల శివ సర్ చెప్పిన స్కిప్ట్‌కు బాగా కనెక్ట్ అయ్యాను. మహేశ్, చిత్రయూనిట్‌తో నా ప్రయాణం అద్భుతంగా సాగింది. మహేశ్‌ సర్ తో జర్నీ ఓ యాక్టర్‌గా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మహేశ్, శివ టీంతో పనిచేస్తున్నపుడు ఎంతో సౌకర్యవంతంగా అనిపించింది. తాను ఆడియో లాంఛ్‌లో మహేశ్ సర్‌తో మళ్లీ పనిచేయాలని ఉందని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది కైరా. అన్నీ కుదిరితే భరత్ అనే నేను-2 (సీక్వెల్‌)లో మహేశ్‌తో కలిసి నటిస్తానేమోనని చెప్పుకొచ్చింది కైరా. అంటే భ‌ర‌త్ అనే నేను సినిమా సీక్వెట్ ఉండ‌బోతుంద‌నే మెసేజ్ డైరెక్ట్‌గా ఇచ్చింద‌న్నమాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -