Friday, May 3, 2024
- Advertisement -

బిగ్‌బాస్ త‌ర్వాత మ‌రోకొత్త గొడ‌వ‌లో ఇరుక్కున్న‌ నాగార్జున‌

- Advertisement -

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్ర మన్మధుడు 2. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని ఈ రోజు ఉదయమే విడుదల చేసారు చిత్ర యూనిట్. ఊహించిన స్థాయి లో ఈ ట్రైలర్ లేనప్పటికీ ట్రైలర్ లో నాగార్జున చెప్పిన డైలాగ్ ఒకటి వివాదాస్పదం అయింది. “ఇంతకు ముందు ఎప్పుడూ ప్రేమలో లేరా మీరు” అని హీరోయిన్ నాగార్జున ని అడిగితే, “ఒక పూట భోజనం కోసం నేను వ్యవసాయం చేయను” అని నాగార్జున అంటాడు. ఈ డైలాగ్ ప్రస్తుతం వివాదం అవుతుంది. నాగార్జున లాంటి స్టేచర్ ఉన్న హీరో సినిమా లో ఇలా రైతుల ని తక్కువ చేసి మాట్లాడటం, ప్రేమ వ్యవహారాలకు సంబంధించి జోక్ చేసుకోడానికి వ్యవసాయాన్ని లాగడం సరిగా అనిపించడం లేదు.

అంటే వ్యవసాయం చేసే వాళ్ళు అన్నా, వ్యవసాయం అన్నా అంత చులకనా ఈ సినిమా చేసిన దర్శక నిర్మాతలకి అనే ప్రశ్న తలెత్తుతుంది. వ్యవసాయాన్ని ప్రేమ, సెక్స్, మ్యారేజ్ లతో లింక్ పెట్టి హేళన చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఒక వైపు మహర్షి సినిమా తో మహేష్ బాబు లాంటి హీరోలు వ్యవసాయం వైపు కి దృష్టి మరలుస్తుంటే, నాగార్జున మాత్రం ఇలా వ్యవసాయం అగౌరవం అయేలా కామెంట్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని మనం ఆలోచించుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -