Wednesday, May 8, 2024
- Advertisement -

మహేష్ కత్తి ని ఇన్సల్ట్ చేసిన కొబ్బరి మట్ట టీమ్

- Advertisement -

కొబ్బరి మట్ట అనే ఒక ఆసక్తికరమైన సినిమా ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథ కథనం తో సంబంధం లేకుండా ఓవర్ ది టాప్ సీన్ల తో ఈ సినిమా ని రాసుకున్నారు దర్శకుడు. ఈ సినిమా లో సంపూర్ణేష్ బాబు హీరో గా నటించి త్రిపాత్రాభినయం కూడా చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ని నిన్న ప్రీ రిలీజ్ వేడుక లో విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ట్రైలర్ లో మహేష్ కత్తి చేసిన పాత్ర ని భలే విచిత్రం గా చూపించారు. ఆ మధ్య మహేష్ కత్తి కి ఈ సినిమా నిర్మాత సాయి రాజేష్ కి మధ్య విభేదాలు వచ్చాయి. అయితే షూటింగ్ చివరి రోజుల్లో మహేష్ ని షూటింగ్ కి కూడా పిలవలేదట.

ఇప్పుడు ట్రైలర్ లో షకీలా మహేష్ కత్తి ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటె, ఏమైంది అని ఆవిడ ని ఒకరు ప్రశ్నించగా, దానికి జవాబుగా, “ఎక్కడ పడితే అక్కడ,ఏది పడితే అది వాగుతున్నదని పోలీసులు నగర బహిష్కరణ చేశారు.” అని షకీలా చెప్పడం హాస్యాస్పదం గా ఉంది. ఈ రకంగా ఈ సినిమా యూనిట్ మహేష్ కత్తి ని ఇన్సల్ట్ చేసింది అని కొందరు అంటున్నారు. అయితే దీని పైన మాత్రం కత్తి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన తెలియజేయలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -