టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కోలీవుడ్ కు వెళ్లి అక్కడ రచ్చ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆమెపై చర్యలకు సిద్దం అవుతుంది తమిళ చిత్ర పరిశ్రమ.అయితే ఇలాంటి భామకు నేను అవకాశం ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు ఓ నిర్మాత.ఆ నిర్మాత మరెవరో కాదు ప్రముఖ నటి కుట్టి పద్మిని. బాలనటిగా సినిమా రంగానికి పరిచయమైన పద్మిని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించారు.
ప్రస్తుతం ఆమె సీరియల్, వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె నిర్మించే సీరియల్స్‌లో శ్రీరెడ్డికి అవకాశం ఇస్తానని చెబుతున్నారు కుట్టి పద్మిని. కాకపోతే ఓ షరతుతోనే శ్రీరెడ్డికి అవకాశం ఇస్తానని తెలిపారు.శ్రీరెడ్డి ఇక మీద ఎవరిపై కామెంట్స్ చేయకుడదని కండిషన్ పెట్టింది శ్రీరెడ్డిమరి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.