Sunday, April 28, 2024
- Advertisement -

రొమాంటిక్ గా డాన్స్ చేసి ఫ్యాన్స్ ని ఫిదా చేసిన నిహారిక..!

- Advertisement -

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల ’ఒక మనసు’ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయిన నిహారికకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్’‘సూర్యకాంతం’ సినిమాలు కుడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొందింది.

నిహారిక తాజాగా చిరంజీవి ‘సైరా’ సినిమాలో బోయ పిల్ల పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నాయి. హీరోయిన్ గా రాణించాలంటే గ్లామర్ కూడా అవసరం. కానీ నిహారిక తన హద్దులు దాటకుండానే తన ట్యాలెంట్ బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నిహారిక స్టైలిష్ దుస్తుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటోంది. బుధవారం రోజు ఇంటర్నేషనల్ డాన్స్ డే జరిగింది.

ఈ సందర్భంగా నిహారిక తన ఫస్ట్ డాన్స్ వీడియోతో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. నిహారిక చేసిన ఈ రొమాంటిక్ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ తో కలిసి నిహారిక డాన్స్ చేసింది. బ్యాగ్రౌండ్ లో చెలి చిత్రంలోని ‘మనోహర’ సాంగ్ మ్యూజిక్ ప్లే చేసి నిహారిక మతిపోగోట్టే డాన్స్ మూమెంట్లతో అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో నిహారిక చేసిన పెర్ఫార్మన్స్ కు ఎవరైన ఫిదా కావాల్సిందే.

https://www.instagram.com/p/B_kjmGip-FX/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -