Sunday, May 12, 2024
- Advertisement -

సీత.. రాముని కోసం.. ఆడియో విడుదల లో నిహారిక

- Advertisement -

తెలుగు టీవీ సమర్పణలో శరత్ శ్రీరంగం, కారుణ్య జంటగా నటిస్తున్న చిత్రం సీత..రాముని కోసం. అనిల్ గోపిరెడ్డి సంగీత మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మూవీ ఆడియోని ఈ ఉదయం మెగా ఫామిలీ వారసురాలు నిహారిక చేతులమీదుగా విడుదల చేసారు. సీత రాముని కోసం పాటలు చాలా బావున్నాయని, చిత్రం ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా వుందని.. మూవీ తప్పకుండ చూస్తానని నిహారిక చెప్పారు.

ఈ చిత్రం విజయవంతం కావాలని నిహారిక అభినందనలు తెలియచేసారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ నా రెండో సినిమా చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చిత్రం ఆడియో మెగా వారసురాలి చేతుల మీదుగా రిలీజ్ కావడం ఆనందంగా ఉందని అన్నారు. తన మొదటి సినిమా ఆడియో నిహారిక లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చిత్ర హీరో శరత్ శ్రీరంగం చెప్పారు. ఈ సీత రాముని కోసం చిత్రానికి మాటలు-వేణు రాచర్ల , ఎడిటింగ్- సాయి తలారి , కెమెరామెన్ – జయపాల్ రెడ్డి , రచన ,సంగీతం,దర్శకత్వం – అనిల్ గోపిరెడ్డి. సెన్సార్ కార్య క్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల్లోనే ఈ చిత్రం విడుదలకి సిద్దమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -