Thursday, May 8, 2025
- Advertisement -

కొరటాల కొట్టబోయేది… నారాయణ చైతన్యలనేనా..

- Advertisement -

కొరటాల శివ చిత్రాలు ఎప్పుడూ మెసేజ్ పుల్ గానే ఉంటాయి. అతను చేసే ప్రతిచిత్రం ఏదో ఒక మెసేజ్ కు ప్రేక్షకులకు ఇస్తుంటుంది. అందుకే అతని చిత్రాల పట్ల ప్రేక్షకులకు అంత మంచి గుడ్ విల్ ఉంటుంది. తాజాగా అతని చూపు కార్పొరేట్ ఎడ్యుకేషన్ పై పడింది. వేలు – లక్షల మేర ఫీజులు కట్టి కార్పొరేట్ కళాశాలల్లో తమ పిల్లలను జాయిన్ చేస్తే… టెన్షన్ తట్టుకోలేక ఆయా కళాశాలల హాస్టళ్లలోనే ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలను చూసిన కొరటాల ఈసారి అటువైపుగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న కళాశాలల యాజమాన్యాలపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అంటే.. ఏం లేదన్న సమాధానమే వినిపిస్తోంది. అయినా సదరు విద్యా సంస్థలకు చెందిన యజమానే ఓ స్టేట్ కు కేబినెట్ లో కీలక శాఖ మంత్రిగా …. విద్యా సంబంధిత వ్యవహారాలు చూసే బాధ్యతలు సదరు మంత్రివర్యుడి వియ్యంకుడి చేతిలో ఉంటే… చర్యలు అసలు ఎందుకుంటాయి చెప్పండి.

ఈ తరహా వ్యవస్థ సగటు జీవిని కలచివేస్తోంది. సగటు జీవితో పాటు సమాజ ఉద్ధరణకు తమవంతు కృషి చేస్తున్న సినీ దర్శకులను కూడా ఈ దురవస్థ వేధిస్తోందనే చెప్పాలి. అందుకేనేమో… టాలీవుడ్ అగ్ర దర్శకుడు కొరటాల శివ… ప్రస్తుత విద్యా వ్యవస్థపై తనదైన స్టైల్లో ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇంతకుముందు రాజకీయ వ్యవస్థ – అవినీతిపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన కొరటాల… ఇప్పుడు విద్యా వ్యవస్థపై మాత్రం ఆసక్తికరంగా – జనాలను ఆలోచనలో పడేసే విధంగా కామెంట్ చేశారు. ట్విట్టర్ లో కొరటాల చేసిన కామెంట్ ఏంటనే విషయానికి వస్తే… మన విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హాయిగా ఆనందిస్తూ..

చదువుకునే రోజులని మళ్లీ తీసుకురావాలి అంటూ కొరటాల ట్వీట్ చేశారు. చూసేందుకు ఇది చాలా చిన్న ట్వీట్ లా అనిపించినప్పటికీ… ఆయన చెప్పింది తగలాల్సిన వారికి గట్టిగానే తగిలింది. దీనిని ఆయన ట్వీట్ తోనే వదిలేస్తాడా లేక సినిమాతో అంటూ చూస్తాడా అనేది తేలాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -