వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ అందుకున్న దర్శకుడు ఎవరంటే వెంటనే కొరటాల శివ పేరు గుర్తుకు వస్తుంది. రొటీన్ కమర్షియల్ చిత్రాల తరహాలో కాకుండా.. కమర్షియల్ అంశాలు ఉంటూనే సందేశాన్ని ఇవ్వడం కొరటాల స్టైల్ అని అర్థం అయిపోయింది. ప్రతి చిత్రంలోనూ కొరటాల శివ అంతర్లీనంగా ఎదో ఒక స్నాదేశాన్ని ఇస్తున్నారు. తాజాగా భరత అనే నేను చిత్రంతో కొరటాల శివ పేరు మారుమోగుతోంది.దాంతో యువ కథానాయకులంతా ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.
అయితే కారటాల నెక్స్ట్ మూవీ ఏంటనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇటీవల విడుదలైన భరత్ అనే నేను చిత్రాలని గమనిస్తే సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. అభిమానులకు కావలసిన కమర్షియల్ ఎలిమెంట్స్ అందిస్తూనే తాను చెప్పాలనుకున్నా సందేశాన్ని విజయవంతంగా ప్రేక్షకులకు చేరవేస్తున్నారు.
తన తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఎన్టీఆర్ .. చరణ్ లు రెండేసి ప్రాజెక్టులను కమిటైపోయి వున్నారు. ఇక ‘నా పేరు సూర్య’ తరువాత ఏ దర్శకుడితోనూ కమిట్ కానిది అల్లు అర్జున్ మాత్రమే. అందువలన ఆయనతోనే కొరటాల నెక్స్ట్ మూవీ వుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.