Friday, March 29, 2024
- Advertisement -

బన్నీతర్వాతి చిత్రం పాన్ ఇండియా మూవీ !

- Advertisement -

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులకు కమిట్ మెంట్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతున్న పుష్ఫ సినిమాలో న‌టిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా పూర్తికావ‌చ్చింద‌ని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా పుష్ప తర్వాత అల్లు అర్జున్ న‌టించ‌బోమే త‌ర్వాతి మూవీ గురించి క్రేజీ అప్‌డేట్ వ‌చ్చింది. ఇప్ప‌టికే నాలుగు సినిమాల‌కు బన్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం పుష్ప షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే సినిమాలో అల్లు అర్జున్ న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం కోర‌టాల శివ మెగాస్టార్ చిరంజీవితో తీస్తున్న ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఇటు అల్లు అర్జున్ సైతం పుష్ప చిత్ర షూటింగ్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే సినిమాను ష‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని బ‌న్నీ.. సుకుమార్‌ను కోరార‌ట‌. ఈ సినిమాను ఆగ‌స్ట్ 13న విడుదల చేయనున్నట్టు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఈ నేప‌థ్యంలోనే చిరు ఆచార్య‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట కోర‌టాల శివ‌. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీతో సినిమాను మొద‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ చిత్రాన్ని ఆగ‌స్టులో షూటింగ్ ప్రారంభించి స‌మ్మ‌ర్‌లో ఇడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సుధాక‌ర్ మిక్కిలినేని దీనికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌నీ, పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న‌ద‌ని ప్ర‌క‌టించారు.

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉప‌శ‌మ‌నం పొందండి !

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -