మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం వినయ విధేయ రామ.బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(గురువారం) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.చిరు, కేటీఆర్ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతు కేటీఆర్ నాకు బెంచ్‌మేట్ అని తెలిపారు.
రామ్ చరణ్ ఫ్రెండ్ అయిన కేటీఆర్ చిరుకు ఎలా బెంచ్‌మేట్ ఎలా అయ్యాడని తొలుత అందరిలోను అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేశారు చిరు.2009లో చిరు ప్రజారాజ్యం తరుపున గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేటీఆర్ కూడా సిరిసిల్ల నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీలో తామిద్దరం పక్క పక్కనే కూర్చునేవారమని చెప్పుకొచ్చారు చిరు.
ఆ సమయంలో కేటీఆర్ పెద్దగా ఏం మాట్లాడేవాడు కాదని,వినయంగా ఉండేవారు,కాని ఇప్పుడు ఆయనను చూస్తుంటే పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కేటీఆర్‌లో కనిపిస్తున్నాడని, మాటలను తూటల్లాగా వదులుతున్నారని ప్రశంసించారు చిరు.మొత్తానికి సరదా సరదాగా సాగింది ఈ కార్యక్రమం.
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు