యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టాడు. తెలంగాణ ఎన్నికలలో తన అక్క నందమూరి సుహాసిని కూకట్‌పల్లి నియోజిక వర్గం నుంచి పోటీ చేసినప్పటికి ,సుహాసిని తరుపున ప్రచారం చేయలేదు ఎన్టీఆర్. కేవలం ప్రెస్ నోట్‌ను మాత్రమే విడుదల చేసి చేతులు దూలుపుకున్నారు. భవిష్యత్తులో టీడీపీని లీడ్ చేసేది ఎన్టీఆరే అని చాలామంది నమ్ముతున్నారు. మరి అలాంటి ఎన్టీఆర్ తెలంగాణ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్‌ను కలవడం సంచలనంగా మారింది. కేటీఆర్‌తో ఎన్టీయార్ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓ పార్టీలో వీరిద్దరు కలుసుకున్నట్లు సమాచారం.కేటీఆర్‌ను ఎన్టీఆర్ కలవడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీని లేకుండా చేద్దామని చూస్తున్న టీఆర్ఎస్ నాయకుడితో ఎన్టీఆర్ ఇలా కలవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.మరి కొందరు ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.కేటీఆర్‌తో ఎన్టీఆర్ ఫోటో దిగడాన్ని వారు సమర్థిస్తున్నారు.కేటీఆర్‌తో కలిసి ఎన్టీఆర్ ఫోటో దిగితే తప్పు ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్
సినిమాలో నటిస్తున్నాడు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!