ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో మహా కుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించగా ఇక కుంభమేళాలలో హైలైట్‌గా నిలిచింది మోనాలిసా. పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తాను తీయబోయే సినిమాలో మోనాలిసాకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. చెప్పినట్లుగానే ఇవాళ మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని మోనాలిసా స్వగ్రామంలో ఆమెను కలిశారు.
మోనాలిసాను సినిమాల్లో నటించే విధంగా ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించారు. సనోజ్ మిశ్రా తీయబోయే డైరీ ఆఫ్ మణిపూర్‌లో నటించేందుకు ఒప్పుకోగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. మోనాలిసా పాత్ర సినిమాల్లో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోందని తెలిపారు సనోజ్. సినిమా షూటింగ్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం ఉండటంతో ఆమెకు యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపగా ఆమెకు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.