Monday, May 6, 2024
- Advertisement -

ప్రభాస్ పై మనసు పారేసుకున్న మహిళా దర్శకురాలు

- Advertisement -

ఓ బేబీ సినిమా తో నందిని రెడ్డి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సమంత ముఖ్య పాత్ర లో నటించిన ఈ సినిమా జులై 4 న విడుదల కానుంది. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ లో గట్టిగా జరుగుతున్నాయి. అందులో భాగం గా నందిని రెడ్డి చాలా ఇంటర్వూస్ ఇస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తనకి ఒక స్టార్ హీరో మీద క్రష్ ఉంది అని తెలిపారు.

ఆవిడ తన ఇష్టాయిష్టాల గురించి చెప్తూ యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పిచ్చి అని, తన మీద క్రష్ ఉంది అని చెప్పారు. ఒక ఆంగ్ల దినపత్రిక తో మాట్లాడుతూ ఈ విషయం బయట పెట్టిన నందిని రెడ్డి ప్రభాస్ మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్త పరిచే అవకాశం ఎప్పుడూ రాలేదు అని తెలిపారు. ఎప్పుడు ప్రభాస్ కనిపించినా అలా మాట్లాడకుండా ఉండిపోతాను అని ఆవిడ తెలపడం విశేషం. అలాగే ఏదో ఒక రోజు ప్రభాస్ తో పని చేసే అవకాశం వస్తే, తప్పకుండా సంతోషిస్తాను అని కూడా తెలిపారు.

రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్, జగపతి బాబు మరియు తదితరులు ఈ ఓ బేబీ సినిమా లో నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -