Sunday, May 4, 2025
- Advertisement -

అందాలు ఆరబోసిన ఆడ‌లే

- Advertisement -
  • జూలీ-2 సినిమా నిరాశ‌

వివాదాల‌తో సినిమాలు హిట్టు సాధిస్తాయ‌ని న‌మ్మ‌కం ఉట్టిమాటే… అందాల‌న్నీ ఆరబోసి, హాట్‌హాట్‌గా చూపించేసి లిప్‌లాక్‌లు, ఆ స‌న్నివేశాలు చూపించేస్తే సినిమాలు ఆడుతాయ‌నే సూత్రం ఇప్పుడు ప‌ని చేయ‌డం లేదు. క‌థా, క‌థ‌నం లేనిది సినిమాను ఇప్పుడు ప్రేక్ష‌కులు ఆద‌రించ‌డం లేదు. అందుకు నిద‌ర్శ‌న‌మే జూలీ-2 సినిమా.

తెలుగు, త‌మిళ్‌లో హీరోయిన్‌గా, న‌టిగా కెరీర్ ప్రారంభించిన ల‌క్ష్మీరాయ్‌కి అవ‌కాశాలు వ‌చ్చినా ఫ‌లితాలు నిరాశ‌గా మిగిలాయి. దీంతో దిశ మార్చి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ప్ర‌త్యేక గీతాల్లో డ్యాన్స‌ర్‌గా న‌ర్తించింది. అలాంటి ఆమెకు బాలీవుడ్ నుంచి ఓ మంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు దీపక్‌ శివ్‌దాసాని ఒక‌ప్ప‌టి సినీతార జీవితంలోని చీక‌టి కోణాన్ని క‌థాంశంగా తీసుకొని జూలీ-2గా ల‌క్ష్మీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌లో తీశాడు. ట్రంప్ టాకీస్ ఆధ్వ‌ర్యంలో విజయ్‌ నాయర్‌, దీపక్‌ శివ్‌దాసాని, పహ్లాజ్‌ నిహ్లానీ సంయుక్తంగా ఈ సినిమాను తీశారు. కథ కంటే.. హీరోయిన్‌ ఎక్స్‌పోజింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పాత్రలు చాలా ఉన్నా.. వారిని సరిగా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు లాజిక్‌ లేకుండా సాగుతాయి. చాలా సన్నివేశాలు నత్తనడకగా సాగుతాయి. రాయ్‌ లక్ష్మీ.. దక్షిణాదిలో చాలా సినిమాల్లో నటించినా.. బాలీవుడ్‌ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. అయినా తన ప్రయత్నం తను చేసి మెప్పించింది.

కొన్ని సన్నివేశాల్లో చక్కగా నటించిన ఆమె, మరికొన్ని సన్నివేశాల్లో తేలిపోయింది. అయితే అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రతి అగ్నిహోత్రి, పంకజ్‌ త్రిపాఠి వంటి మంచి నటులకు వారి తగ్గ స్థాయి పాత్రలు ఈ చిత్రంలో లభించలేదు. వారి పాత్రలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దితే బాగుండేది. దర్శకుడు రెండు అంశాలను తీసుకున్నా.. చిత్రీకరణలో పూర్తిగా వాటి ఉద్దేశాలను విస్మరించాడు. సంగీతం, నేపథ్య సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. సమీర్‌రెడ్డి కెమెరాతో సినిమాకు రిచ్‌నెస్‌ తీసుకొచ్చారు. ఎడిటర్‌ తన కత్తికి మరింత పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -